- ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటలీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
- ఇందులో భాగంగా రాత్రిపూట నైట్ క్లబ్బుల్లో పూటుగా మద్యం సేవించిన మందుబాబులను ట్యాక్సీల్లో ఉచితంగా ఇంటిదగ్గర దించుతారు.
- ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ఆరు నైట్ క్లబ్బుల వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మందు బాబుల కోసం క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. క్లబ్ నిష్క్రమణ ద్వారం వద్ద మద్యం తాగిన వారికి ఆల్కహాల్ పరీక్షలు చేస్తారు.
- ఎవరైనా పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలితే వారిని క్యాబ్‌లో ఎక్కించి ఇంటికి పంపిస్తారు. అందుకు ఎలాంటి మొత్తం వసూలు చేయరు. ఆ భారాన్ని రవాణా శాఖ భరిస్తుంది.
- ఇటలీ రవాణా శాఖ మంత్రి మాటియో సాల్విని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబరు నెల వరకు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.
No comments:
Post a Comment