Tuesday, August 15, 2023

Meri Saheli : రైలు ప్రయాణంలో తోడు ‘మేరీ సహేలీ’


  • రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం రైల్వేశాఖ ‘మేరీ సహేలీ’ని ప్రారంభించింది. 
  • ఇందులో భాగంగా రైల్వే రక్షక దళం మహిళా పోలీసు బృందాలను రంగంలోకి దించింది. ఒక్కో బృందంలో రైలులో ఒంటరిగా ప్రయాణించే మహిళల సంఖ్యను బట్టి ఒక ఎస్‌ఐతోపాటు కనిష్ఠంగా ఇద్దరు, గరిష్ఠంగా 24 మంది సిబ్బంది ఉంటారు. 
  • ఒంటరిగా ప్రయాణించే మహిళలు రైలు ఎక్కడం దగ్గర్నుంచి.. నిర్దేశిత స్టేషన్‌లో దిగే వరకు వారి రక్షణను పర్యవేక్షించడం వీరి బాధ్యత.

క్రిస్‌ యాప్‌తో అనుసంధానం

  • రైలు ప్రయాణ రిజర్వేషన్ల ఆధారంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల వివరాలను గుర్తించేందుకు రైల్వేశాఖ క్రిస్‌ (సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌) అనే యాప్‌ను రూపొందించింది. 
  • రిజర్వేషన్‌ చేసుకునే సమయంలో ఇచ్చే సమాచారం ఆధారంగా మహిళా ప్రయాణికురాలి పేరు, పీఎన్‌ఆర్‌ నంబరు, ప్రయాణించే రైలు, బోగీ, బెర్తు సంఖ్యతోపాటు ఎక్కే, దిగే స్టేషన్ల వివరాలు ఆ యాప్‌లో నమోదవుతాయి. 
  • మేరీ సహేలీ బృందంలోని సభ్యులు తమ వద్ద ఉన్న ట్యాబ్‌లోని యాప్‌ ద్వారా ఆ వివరాలు తెలుసుకుంటారు. ఒంటరి ప్రయాణికుల వద్దకు వెళ్లి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. 
  • ఏదైనా సమస్య తలెత్తితే సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరూ ఇస్తారు. ప్రయాణికురాలు దిగాల్సిన స్టేషన్‌కు రైలు చేరుకోగానే వారితో మాట్లాడి, సురక్షితంగా చేరుకున్నారా? లేదా అనేది ఆరాతీస్తారు.

No comments:

Post a Comment