Friday, August 18, 2023

Parthasarathi Reddy and Ayodhya Ramireddy : రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులుగా నిలిచిన పార్థసారథిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి ఏ పార్టీకి చెందినవారు?

Parthasarathi Reddy and Ayodhya Ramireddy-successsecret

  • తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారాస, వైకాపాలకు చెందిన సభ్యులు.. అత్యధిక ఆస్తి విలువలతో జాతీయపార్టీల సభ్యుల కంటే పై స్థానంలో నిలిచారు. పెద్దలసభలో అత్యధిక ఆస్తులున్న ఎంపీలుగా తొలి రెండు స్థానాల్లో భారాస ఎంపీ బండి పార్థసారథిరెడ్డి, వైకాపా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిలు నిలిచారు. 
  • పార్థసారథిరెడ్డి ఆస్తుల విలువ రూ.5300 కోట్లు కాగా, అయోధ్యరామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్ల మేర ఉంది. రాజ్యసభలో 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ. 18,210 కోట్లు కాగా.. అందులో వీరిద్దరి సంపదే 43.25 శాతం ఉంది. భారాస, వైకాపాలకు చెందిన 16 మంది ఆస్తుల విలువలో వీరి వాటా ఏకంగా 86.02 శాతం. 
  • వీరి తర్వాతి స్థానంలో రూ. 1001 కోట్లతో అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ నిలిచారు. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 233 మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్‌లను పరిశీలించి  అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ ఈ వివరాలు వెల్లడిరచింది. 
  • రాజ్యసభలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న భాజపా (85) కాంగ్రెస్‌ (30)లకు చెందిన 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.4,128 కోట్లయితే, భారాస (7), వైకాపా (9)లకు చెందిన 16 మంది సభ్యుల ఆస్తి విలువ రూ.9,157 కోట్ల మేర నమోదైంది. ఈ విషయాన్ని ఏడీఆర్‌ సంస్థ 2023 ఆగస్టు 18న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
  • పార్టీలవారీగా చూస్తే భారాస సభ్యుల మొత్తం ఆస్తి విలువ రూ.5,596 కోట్లు కాగా, వైకాపా సభ్యులు రూ.3,561 కోట్లు, భాజపా సభ్యులు రూ.2,579 కోట్లు, కాంగ్రెస్‌ సభ్యులు రూ.1,549 కోట్లు, ఆప్‌ సభ్యులు రూ.1,316 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు రూ.1,019 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
  • రాష్ట్రాలవారీగా సభ్యుల ఆస్తుల విలువలో తెలంగాణ (రూ.5,596 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.3,823 కోట్లు) తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.1,941 కోట్లు), పంజాబ్‌ (రూ.1,136 కోట్లు), మహారాష్ట్ర (రూ.1,070) నిలిచాయి.
  • 225 మంది సభ్యుల్లో 27 (12%) మంది అపర కోటీశ్వరులు (బిలియనీర్లు). ఇందులో భాజపా వారు ఆరుగురు, కాంగ్రెస్‌ నలుగురు, వైకాపా నలుగురు, ఆప్‌ ముగ్గురు, భారాస ముగ్గురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు.
  • ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల్లో 45%, తెలంగాణ ఎంపీల్లో 43%, దిల్లీ ఎంపీల్లో 33%, పంజాబ్‌ ఎంపీల్లో 29% బిలియనీర్లు ఉన్నారు.
  • అత్యధిక అప్పులున్న ఎంపీల్లోనూ వైకాపా సభ్యులు తొలి రెండుస్థానాల్లో ఉన్నారు. వీరిలో పరిమళ్‌ నత్వానీకి రూ.209 కోట్లు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి రూ.154 కోట్ల అప్పులున్నాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం చూపిన ఎంపీల్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (రూ.279 కోట్లు), బండి పార్థసారథి రెడ్డి (రూ.140 కోట్లు), అభిషేక్‌ మనుసింఫ్వీు (రూ.131 కోట్లు) తొలి మూడు స్థానాలను ఆక్రమించారు.

75 మందిపై క్రిమినల్‌ కేసులు

  • 225 మంది ఎంపీల్లో 75 (33%) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అందులోనూ 41 (18%) మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి. ఇద్దరు ఎంపీలపై ఐపీసీ 302 సెక్షన్‌ కింద హత్యకేసులున్నాయి. 
  • మరో నలుగురిపై ఐపీసీ 307 కింద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇంకో నలుగురు ఎంపీలు.. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.. కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై ఐపీసీ సెక్షన్‌ 376 కింద అత్యాచార కేసు ఉంది.


Parthasarathi Reddy and Ayodhya Ramireddy who are the richest Rajya Sabha members belong to which party?

  • The members from Bharasa and Vaikapa representing the Rajya Sabha from the Telugu states have ranked higher than the members of the national parties with the highest property values. Bharas MP Bandi Parthasarathi Reddy and Vaikapa MP Alla Ayodhya Ramireddy are the MPs with the most assets in the Peddal Sabha.
  • Parthasarathi Reddy's assets are worth Rs.5300 crores, while Ayodhya Ramireddy's assets are worth Rs.2,577 crores. The assets of 225 members of the Rajya Sabha are worth Rs. 18,210 crores.. out of which the wealth of these two is 43.25 percent. Their share in the property value of 16 people belonging to Bharasa and Vaikapa is 86.02 percent.
  • Next to them is Rs. Amitabh Bachchan's wife and Samajwadi Party MP Jaya Bachchan stood with 1001 crores. The Association for Democratic Reforms (ADR) has revealed these details after examining the affidavits of 225 of the 233 members currently representing the Rajya Sabha.
  • The total assets of 115 members of BJP (85) and Congress (30), which are the largest parties in the Rajya Sabha, are worth Rs 4,128 crore, while the assets of 16 members of Bharatiya Janata Party (7) and Vaikapa (9) are worth Rs 9,157 crore. This has been stated by the ADR organization in a report released on August 18, 2023.
  • The total property value of Bharatiya Janata Party members is Rs.5,596 crores, while Vaikapa members have Rs.3,561 crores, BJP members have Rs.2,579 crores, Congress members have Rs.1,549 crores, AAP members have Rs.1,316 crores and Samajwadi Party members have properties worth Rs.1,019 crores. have
  • Telangana (Rs. 5,596 crores) and Andhra Pradesh (Rs. 3,823 crores) are in the first two places in the value of assets of members by states. It was followed by Uttar Pradesh (Rs. 1,941 crore), Punjab (Rs. 1,136 crore) and Maharashtra (Rs. 1,070).
  • Of the 225 members, 27 (12%) are extra-millionaires (billionaires). In this there are six from BJP, four from Congress, four from Vaikapa, three from AAP, three from Bharas and two from RJD. They have declared assets of more than Rs.100 crore each.
  • 45% of Andhra Pradesh MPs, 43% of Telangana MPs, 33% of Delhi MPs and 29% of Punjab MPs are billionaires.
  • Vaikapa members are in the first two positions among MPs with the highest debts. Among them, Parimal Natwani has Rs.209 crores and Alla Ayodhya Ramireddy has Rs.154 crores.
  • Alla Ayodhyarami Reddy (Rs. 279 crores), Bandi Parthasarathy Reddy (Rs. 140 crores) and Abhishek Manusimphviu (Rs. 131 crores) occupied the top three positions among the MPs who showed the highest income in a financial year.

Criminal cases against 75 people

  • Out of 225 MPs, 75 (33%) have criminal cases against them. Out of that 41 (18%) people were charged with serious crimes. There are murder cases against two MPs under IPC section 302.
  • Cases of attempt to murder under IPC 307 have been registered against four others. Four more MPs.. are facing charges of committing crimes against women.. There is a case of rape under Section 376 of the IPC against Congress General Secretary for Organizational Affairs KC Venugopal.

No comments:

Post a Comment