Tuesday, August 15, 2023

కస్టమ్స్‌ శాఖ పేరుతో ఆన్‌లైన్‌ మోసాలపై కేంద్రం హెచ్చరిక

  •  ఆన్‌లైన్‌ మోసగాళ్లు కస్టమ్స్‌ శాఖ పేరుతో అమాయకులైన వినియోగదారులను వంచిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 
  • విదేశాల నుంచి మీకు ఖరీదైన బహుమతి వచ్చిందని చెబుతూ.. దాని కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కోసం కొంత నగదు తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని ఫోన్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. 
  • ‘‘కస్టమ్స్‌ డ్యూటీ డబ్బును వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాలని సూచిస్తూ ఇండియన్‌ కస్టమ్స్‌ ఎప్పుడూ కోరదు. ఫోన్‌ కాల్‌, ఎస్సెమ్మెస్‌ ద్వారా సంప్రదింపులు జరపదు. ఎటువంటి సమాచారమైనా పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర మండలి(సీబీఐసీ) వెబ్‌సైట్‌లో వెరిఫై చేసిన డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (డీఐఎన్‌) ద్వారానే ఇండియన్‌ కస్టమ్స్‌ ఇస్తుంది’’ అని ట్వీట్‌లో పేర్కొంది. 
  • ఇండియన్‌ కస్టమ్స్‌ పేరుతో ఏదైనా డాక్యుమెంట్‌ లేదా ఈ-మెయిల్‌ వస్తే.. ముందుగా అందులో డీఐఎన్‌ ఉందా? లేదా? అని పరిశీలించుకోవాలని సూచించింది.

No comments:

Post a Comment