- అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న 8 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. వాటిలో యహా సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కేపీఎస్ న్యూస్, సర్కారీ వ్లోగ్, ఎర్న్ టెక్ ఇండియా, ఎస్‌పీఎన్9 న్యూస్, ఎడ్యుకేషన్ దోస్త్, వరల్డ్ బెస్ట్ న్యూస్ ఉన్నాయి.
- ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.
- ఈ ఛానెళ్లలో లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై నిషేధం, భారత సైన్యం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ పథకాలు, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్ వంటి వివిధ అంశాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిజనిర్ధారణ విభాగం గుర్తించింది.
- ఈ క్రమంలో ఈ ఛానెళ్లు అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.
No comments:
Post a Comment