Tuesday, October 4, 2016

మైనర్‌ కారుణ్య మరణానికి బెల్జియంలో తొలిసారి అనుమతి


బెల్జియంలో తొలిసారిగా డాక్టర్లు ఓ మైనర్‌ కారుణ్య మరణానికి అనుమతించారు. నయం కాని వ్యాధితో బాధపడుతున్నట్లు మాత్రమే పేర్కొన్న బెల్జియం ఫెడరల్‌ కారుణ్య మరణ కమిషన్‌ అధిపతి విమ్‌ డిస్ట్మెన్స్‌ ఆ మైనర్‌కు సంబంధించిన మరెలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రపంచంలో బెల్జియంలో మాత్రమే ఏ వయసు పిల్లలకైనా కారుణ్య మరణాన్ని ప్రసాదించేలా చట్టం ఉంది. ఈ మేరకు దేశ కారుణ్య మరణ చట్టానికి 2014 లో సవరణ చేశారు. నెదర్లాండ్స్‌ కూడా పిల్లల కారుణ్య మరణానికి అనుమతిస్తున్నా వయసు 12 సం॥లు దాటాలనే నిబంధన ఉంది. 

No comments:

Post a Comment