తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేపట్టిన 6 ఐటీ సంబంధిత కార్యక్రమాలకు జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు లభించాయి. హ్యాక్ ఐ, హైదరాబాద్ కాప్స్, సీసీటీఎన్ఎస్, వెరీఫాస్ట్, ఈ-చలాన్, భరోసా కార్యక్రమాలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే తెలంగాణ జెన్కో పాలన వ్యవహారాల్లో ఈఆర్పీ సాఫ్ట్వేర్ను అత్యంత సమర్థవంతంగా వినియోగించినందుకు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని అందుకుంది. ‘ఒకే దేశం-ఒకే వేదిక’ నినాదంతో స్మార్ట్ ఇండియా లక్ష్యంగా స్కోచ్ ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఐటీ సంబంధిత కార్యక్రమాలపై పోటీలు నిర్వహిస్తోంది.
No comments:
Post a Comment