ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జరిగిన సదస్సులో 6.5 కోట్ల మందికి పైగా శరణార్థులు, వలసదారుల ప్రాణాలు కాపాడాంటూ చేసిన కీలక ప్రకటనను 193 దేశాలకు చెందిన నేతలు ఆమోదించారు. శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బాధ్యతల్ని పంచుకోవాలని తీర్మానించారు. శరణార్థులు, వలసదారులపై న్యూయార్క్ డిక్లరేషన్‌ను ఆమోదించినందుకు సంస్థ సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ సభ్య దేశాలను అభినందించారు. అందరి భద్రత, గౌరవం కోసం కలసికట్టుగా కృషి చేయాలనే కొత్త ఉద్యమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు.
No comments:
Post a Comment