Monday, October 3, 2016

ఏపీలోనూ కొత్త జిల్లాలు ..?


ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబునాయుడు పాలనలో పోటీ పడుతోన్న సంగతి మనకందరికీ తెలిసిందే. పథకాల  ప్రకటనలో గాని, పాలనాపరమైన మార్కులో గానీ ఒకరిని మించి మరొకరు చేయాలనే తపన వారి చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ పథకాలు  ప్రారంభించబడ్డాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు  ప్రవేశపెట్టే పథకాల్లో కాస్త సారూప్యత కనిపస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దసరా నుంచి కొత్త జిల్లాలు  ఏర్పాటు కానున్నాయి. పరిపాలనా సౌలభ్యం మరియు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు  పొందడం కోసం కొత్త జిల్లాల  ఏర్పాటు చేపట్టినట్టు కేసీఆర్‌ పేర్కొన్న నేపథ్యంలో...ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు చేయవచ్చుననే వాదనలు  వినిపిస్తున్నాయి. రాజధానికి సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా జిల్లాల  సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషకులు  భావిస్తున్నారు. అన్ని విషయాల్లో పోటీ పడుతున్న ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రు ఈ విషయంలో కూడా పోటీ పడతారో..లేదో..వేచి చూడాలి మరి! 

No comments:

Post a Comment