విద్యార్థుల్లో పెరుగుతున్న కుంగుబాటు, ఒత్తిడి సమస్యపై పోరాడేందుకు చైనాలోని 100 విశ్వవిద్యాయాల్లో యోగా సాధన కార్యక్రమాన్ని చేపట్టారు. చైనాలోని ప్రఖ్యాత యోగా సంస్థ యోగియోగాపెకింగ్ విశ్వవిద్యాలయం సహకారంతో చేపట్టిన వంద వర్సిటీల్లో వంద రోజులు కార్యక్రమానికి భారీస్థాయిలో విద్యార్థులు హాజరయ్యారు. యోగియోగా వ్యవస్థాపకులు, సీఈఓ యిన్‌యాన్. ఈమె ఈఎల్‌ఎల్‌ఈ అనే అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రిక చైనా ఎడిషన్‌కు మాజీ సంపాదకురాలు. రిషికేష్‌లో భారతీయుడైన మోహన్‌సింగ్ భండారీని వివాహమాడి, 2003లో యోగియోగా సంస్థను స్థాపించారు. భారతీయ ప్రాచీన యోగాను చైనాలో వాణిజ్యపరంగా విజయవంతంగా మార్చి విజయం సాధించారు. ఈ సంస్థకు చైనా వ్యాప్తంగా శాఖలున్నాయి. 20 వేల మందికి పైగా విద్యార్థులున్నారు. భారత్ తర్వాత యోగాను భారీ ఎత్తున చైనాలోనే సాధన చేస్తుండటంతో ప్రధాని మోడి 2015 చైనా పర్యటనలో ఓ యోగా కళాశాలను కూడా ప్రారంభించారు.
Wednesday, October 5, 2016
చైనాలో ‘వంద వర్సిటీల్లో వంద రోజులు’ యోగా కార్యక్రమం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment