Thursday, August 3, 2023

కార్గిల్‌ చిహ్నం వద్దకు 3,200 కి.మీ. సైకిల్‌యాత్ర చేపట్టిన విద్యార్థులు ఎవరు?


  • కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులు అర్పించడానికి బెంగళూరు విద్యార్థులిద్దరు 60 రోజుల పాటు 3,200 కిలోమీటర్ల దూరం సైకిళ్లపై పయనించి ఇక్కడి స్మారకచిహ్నం వద్దకు చేరుకున్నారు. కార్గిల్‌లో పాక్‌ చొరబాటుదారులను తిప్పికొడుతూ అమరుడైన కెప్టెన్‌ వైజయంత్‌ థాపర్‌ వీరకృత్యాలు వీరికి ప్రేరణ ఇచ్చాయి. 
  • బెంగళూరు రామయ్య కళాశాలలో బీబీఏ చదువుతున్న ఎ.కృష్ణన్‌, సెయింట్‌ జోసెఫ్స్‌ విశ్వవిద్యాలయంలో బీకాం చదువుతున్న పెద్ది సాయికౌశిక్‌ ఎన్‌.సి.సి. కేడెట్లు కూడా. సైన్యంలో చేరడానికి కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలకు వీరు సిద్ధమవుతున్నారు. వీరిద్దరు మే నెలలో కన్యాకుమారి - శ్రీనగర్‌ రహదారి మీదుగా కార్గిల్‌కు బయలుదేరారు. 
  • ఎన్నో అడ్డంకులను అధిగమించి కార్గిల్‌ విజయ దినోత్సవానికి రెండు రోజుల ముందే, జులై 24న కార్గిల్‌ అమరవీరుల స్మారక చిహ్నాన్ని చేరుకున్నారు. ఈ ప్రయాణంలో పంజాబ్‌లో వరదలను ఎదుర్కొన్నారు. సాయికౌశిక్‌కు టైఫాయిడ్‌ వచ్చి రెండు వారాలపాటు మధ్యలోనే ఆగిపోయారు. కృష్ణన్‌ రోడ్డుప్రమాదంలో గాయపడి కొన్నిరోజులు ఆగవలసి వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గడువుకన్నా ముందే ఇక్కడికి చేరుకున్న కృష్ణన్‌, సాయికౌశిక్‌లకు ద్రాస్‌లో సైన్యం వీఐపీ పాసులు ఇచ్చి స్మారకచిహ్నం వద్దకు పంపి సత్కరించింది.

No comments:

Post a Comment