- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న తర్వాత తాము ఇక విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు 2023 ఆగస్టు 2న వారు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడిరచారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై వారు సంతకాలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
- 2005లో వివాహం చేసుకున్న ట్రూడో దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి సంరక్షణను ఇద్దరూ కలిసి చూసుకుంటామని వారు తెలిపారు. ఇప్పటికే ఒట్టావాలో వేరే నివాసంలోకి సోఫీ వెళ్లిపోయారు. పిల్లల్ని చూసుకునేందుకు రిడియా కాటేజికి వస్తుంటానని, అధికారిక పర్యటనల నిమిత్తం ప్రధాని వెళ్లినప్పుడూ పిల్లల్ని చూసుకునేందుకు అక్కడే ఉంటానని ఆమె ప్రకటించారు. ఎప్పటిమాదిరిగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని దంపతులు పేర్కొన్నారు.
- మోడల్‌గా, టీవీ వ్యాఖ్యాతగా సోఫీ సుపరిచితురాలు. ప్రధానిగా పదవిలో ఉంటుండగా భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన రెండో ప్రధాని ట్రూడో. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్ ట్రూడో.
Thursday, August 3, 2023
ఏ దేశ ప్రధాని దంపతులు విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment