Tuesday, August 8, 2023

TS Govt Debit : నేరుగా ప్రభుత్వ అప్పులు రూ.3.21 లక్షల కోట్లు

Telanagana CAG

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు ఏటా పెరుగుతున్నాయి. 2020-21తో పోలిస్తే 2021-22లో 16% అదనంగా అప్పులు నేరుగా ప్రభుత్వం తీసుకుంది. 
  • ఈమేరకు 2022 మార్చి 31 నాటికి నేరుగా ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు రూ.3.21 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు కాగ్‌ వెల్లడిరచింది. 
  • ఇది ‘రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ (జీఎస్‌డీపీ)’లో 28 శాతానికి సమానమని పేర్కొంది. 
  • 2017-18లో జీఎస్‌డీపీలో అప్పుల శాతం 22 ఉండగా ఐదేళ్ల వ్యవధిలో అది మరో 6% పెరిగినట్లు వివరించింది. 
  • 2021-22లో రూ.19,161 కోట్లను వడ్డీలు, అప్పుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఇవికాకుండా మరో రూ.1.35 లక్షల కోట్లకు పైగా రుణాలను వివిధ ప్రభుత్వ సంస్థలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. 
  • ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలెంత అనే వివరాలను బడ్జెట్‌ పత్రాల్లో ప్రభుత్వం చూపడం లేదని కాగ్‌ తెలిపింది. 
  • ప్రభుత్వరంగ సంస్థలు తీసుకునే రుణాలను అవే తిరిగి చెల్లించాలి. అవి చెల్లించలేక ఖాయిలా పడితే తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం పూచీకత్తు ఇస్తోంది.

పరిమితికి లోబడే పూచీకత్తు రుణాలు..

  • పూచీకత్తు రుణాలు పరిమితికి లోబడే ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. ఈ రుణాలు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ రాబడి కంటే 200 శాతానికి మించి తీసుకోకూడదనేది నిబంధన. 
  • 2021-22 ఆఖరు (2022 మార్చి 31) నాటికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుతో తీసుకున్న రుణాలు రూ.1,35,282.51 కోట్లు కాగా అంతకుముందు రెవెన్యూ రాబడి రూ.1,00,914.36 కోట్లు. ఈమేరకు దానిపై మరో 34% ఎక్కువగా పూచీకత్తు రుణం ఉన్నందున మొత్తం 134 శాతానికి చేరింది.
  • ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చి తీసుకునే రుణంలో   0.5% సొమ్మును రిజర్వుబ్యాంకు వద్ద ‘గ్యారంటీ రిడంప్షన్‌ నిధి’ పేరుతో జమచేయాలి. 
  • వాస్తవానికి ఒక శాతం సొమ్మును ఈ నిధికి జమ చేస్తామని, క్రమేణా 0.5 శాతానికి తగ్గిస్తామని 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ జమలతో ఐదేళ్లలోగా మొత్తం పూచీకత్తు రుణాల సొమ్ములో కనీసం 3%,  ఆ తర్వాత 5% సొమ్ము ఈ నిధిలో ఉండేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. 
  • 2021-22లో పూచీకత్తుపై తీసుకున్న రుణాల్లో  0.5% కింద రూ.525.03 కోట్లను ఈ నిధికి తప్పనిసరిగా జమచేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అసలు జమచేయలేదని కాగ్‌ తెలిపింది. అంతకుముందు కాలంలో చేసిన జమలతో ఈ నిధిలో 2022 మార్చి 31 నాటికి మొత్తం రూ.1,430.83 కోట్లు ఉన్నాయి.
  • నేరుగా ప్రభుత్వం తీసుకున్న రూ.3.21 లక్షల కోట్లను వడ్డీలతో సహా నెలనెలా వాయిదాల్లో చెల్లించాలి. ఏటా ఎంత చెల్లించాల్సి ఉంటుందనే లెక్కలను కాగ్‌ వివరించింది. 
  • అప్పులను 5 నుంచి 9.99% వడ్డీకి ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రస్తుత ఏడాది (2023-24)లో రూ.12,058.72 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఏటా ఈ చెల్లింపులు పెరిగిపోతాయని కాగ్‌ వేసిన అంచనాల్లో వివరించింది. ఈమేరకు 2026-27లో రూ.21,847.30 కోట్లు, 2050-51లో రూ.22,622.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

289 రోజులు ప్రత్యేక అడ్వాన్స్‌లు..

  • ప్రభుత్వ పరిపాలనా నిర్వహణకు ఏడాదిలో 289 రోజుల పాటు ప్రత్యేక అడ్వాన్స్‌ల కింద రిజర్వుబ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని కాగ్‌ వెల్లడిరచింది. 
  • 2021-22లో ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలు, వాస్తవ ఆదాయ వ్యయాలపై కాగ్‌ ఆడిట్‌ నివేదికను 2023 ఆగస్ట్ 6న శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 
  • ప్రత్యేక అడ్వాన్స్‌ సొమ్ము తీసుకోకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకులో ప్రతీరోజు కనీసం రూ.కోటీ 38 లక్షల కనీస నిల్వ ఉంచాలి
  • 2021-22లో మాత్రం ఈ నిల్వ కేవలం 76 రోజులే ఉంచగలిగింది. మిగతారోజుల్లో ఈ సొమ్ము నిల్వలేక ప్రత్యేక అడ్వాన్స్‌ తీసుకుందని కాగ్‌ వివరించింది. 
  • మరో రూ.34,969 కోట్లను ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ పద్దు కింద రిజర్వుబ్యాంకు నుంచి ప్రభుత్వం సేకరించింది. నిధుల కొరత వల్ల ఆ ఏడాదిలో 100 రోజుల పాటు ఓవర్‌డ్రాఫ్ట్‌ కింద రూ.22,669 కోట్లను తీసుకుంది. 
  • 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ ఆర్థిక ద్రవ్యలోటు రూ.46,639 కోట్లు ఉంది. దీన్ని అధిగమించడానికి అప్పులు తీసుకుంది. రెవెన్యూ లోటు రూ.9,335 కోట్లు ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది.

No comments:

Post a Comment