Thursday, August 3, 2023

‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా భారత్ ఏయే దేశాల నుంచి 20 చీతాలను తీసుకొచ్చింది?


  • మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు. 2023 ఆగస్టు 2న ఆడ చీతాల్లో ఒకటైన ‘ధాత్రి’ మరణించింది. 
  • ఐదు నెలల వ్యవధిలో ఇప్పటివరకు తొమ్మిది చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించారు. 
  • పులులు, సింహాలు సంచరిస్తున్న స్థాయిలో చీతాలు కూడా వాటి సంతతితో స్వేచ్ఛగా తిరగాలన్నది ‘ప్రాజెక్టు చీతా’ ప్రధాన ఉద్దేశం. భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడే వరకు వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం చీతాలను బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెట్టాలని ప్రణాళిక రచించారు. 
  • అన్ని చీతాల కదలికలు తెలుసుకునేలా వాటికి రేడియో-కాలర్స్‌ను అమర్చారు. ఈ కాలర్స్‌తో తలెత్తిన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా గత నెల రెండు చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మాత్రం అన్నీ సహజమరణాలే అని పేర్కొంది.

No comments:

Post a Comment