- బుకర్ ప్రైజ్ పురస్కారానికి గాను ఈ ఏడాది విజేత ఎంపిక పరిశీలనలో భారతీయ మూలాలున్న రచయిత్రి ‘చేతనా మారూ’ చోటు దక్కించుకున్నారు.
- ప్రాథమిక పరిశీలన కోసం కమిటీ ఎంపిక చేసిన 13 పుస్తకాలలో లండన్ నివాసి అయిన చేతనా మారూ తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ కూడా ఉంది.
- కెన్యాలో జన్మించిన చేతన లండన్‌లో స్థిరపడ్డారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఓ గుజరాతీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలిక..గోపి స్క్వాష్ క్రీడను నేర్చుకునే క్రమంలో ఆమె, ఆమె కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకునే ఘటనలు, భావోద్వేగాలను కథాంశంగా రచయిత్రి ఎంచుకున్నారు.
- సామాజిక, మానవ సంబంధాలను నవలలో చేతనా మారూ హృద్యంగా మలిచారంటూ బుకర్ న్యాయనిర్ణేతల కమిటీ ప్రశంసించింది. 2023 నవంబరు 26న బుకర్ ప్రైజ్ విజేతను కమిటీ ప్రకటించనుంది.
Wednesday, August 2, 2023
బుకర్ ప్రైజ్ పరిశీలనలో ఉన్న ‘వెస్ట్రన్ లేన్’ నవల రచయిత ఎవరు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment