Tuesday, August 8, 2023

IISER Calcutta scientists introduce equation : గ్రహాల ఆవాసయోగ్యతను తెలియజెప్పే సమీకరణం


  • సౌర కుటుంబం వెలుపలి గ్రహాల్లో ఆవాసయోగ్యత స్థాయిని విశ్లేషించేందుకు భారత శాస్త్రవేత్తలు ఒక గణిత సమీకరణాన్ని ప్రతిపాదించారు. కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. 
  • ఒక గ్రహానికి సంబంధించిన అయస్కాంత క్షేత్రం, దాని వాతావరణం, మాతృతార నుంచి వీచే గాలులు వంటి అంశాల మధ్య బంధాన్ని ఈ సమీకరణం విశ్లేషిస్తుంది. మాతృ తార అయస్కాంత క్షేత్రం ఎక్కువగా ఉన్నప్పుడు.. ఆ గ్రహ వాతావరణంలోని ద్రవ్యరాశి క్షీణత రేటు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. 
  • ఇలాంటి పరిస్థితుల్లో ఆ తార నుంచి వీచే బలమైన గాలులు సంబంధిత గ్రహ వాతారణాన్ని వేగంగా హరిస్తాయని వివరించారు. సూర్యుడి నుంచి కూడా ఇలాంటి పవనాలు వీస్తుంటాయి. వీటివల్ల భూవాతావరణానికి గండిపడకుండా.. పుడమికి ఉన్న అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంటుంది.


No comments:

Post a Comment