- పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ (పీఎంశ్రీ) పథకం కింద రాష్ట్రంలో పనులు చేపట్టేందుకు రూ.89 కోట్ల వినియోగానికి ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చింది.
- ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు 60, 40 శాతం ఉన్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ 2023 ఆగస్టు 7న జీఓలు జారీ చేశారు.
- జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించారు.
- మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్ల సరఫరాకు రూ.25.43 కోట్లకు పరిపాలన అనుమతులు సైతం మంజూరు చేశారు. ఆర్థికశాఖ ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది.
Saturday, August 12, 2023
PM Sri : పీఎంశ్రీ పథకానికి రూ.89 కోట్లు మంజూరు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment