Tuesday, August 8, 2023

TS Assembly : శాసనసభ, మండలి నిరవధిక వాయిదా

 

Telanagana Assembly

  • తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు 2023 ఆగస్టు 3 నుంచి 6 వరకు జరిగాయి. నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ, మండలిల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. 
  • ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుతో పాటు పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణల బిల్లులను సభ, మండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రభుత్వానికి ఇది ఆఖరి విడత అసెంబ్లీ సమావేశాలు కావడంతో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో మాట్లాడుతూ.. సభ నిర్వహణలో సహకరించిన సీఎం, ప్రతిపక్ష నేతలు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 
  • శాసనసభ, మండలిలో పురపాలక చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘‘బాన్సువాడ పురపాలక పరిధిలోని కొయ్యగూడెంతండా, ఆలేరు పురపాలక పరిధిలోని సాయిగూడెం గ్రామాలను పురపాలక పరిధి నుంచి తొలగించి ఆ తర్వాత పంచాయతీలుగా గుర్తిస్తాం. ఈ మేరకు చేసిన సవరణ బిల్లును ఆమోదించాలి’’ అని కోరారు. దీన్ని సభ ఆమోదించింది. 
  • అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. కొయ్యగూడెంతండా, సాయిగూడెం గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించాలని కోరారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
  • గద్దర్‌ మృతిపై రాష్ట్ర శాసనసభ, మండలి సంతాపం వ్యక్తం చేశాయి. ఇరుసభల సభ్యులు నివాళులర్పించారు. అనంతరం శాసనసభ, మండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి.

శాసనసభ సమాచారం

- సభ జరిగిన రోజులు : 4

- నిర్వహణ సమయం : 26 గంటల 45 నిమిషాలు

- ప్రశ్నోత్తరాలు                 : 20

- అనుబంధ ప్రశ్నలు : 38

- ప్రసంగాలు         : 44

- ప్రవేశపెట్టిన బిల్లులు : 8

- ఆమోదించిన బిల్లులు : 8

- పునఃప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లులు : 4

- స్వల్పకాలిక చర్చలు : 4


No comments:

Post a Comment