- ఎస్సై, ఏఎస్సై నియామక తుది ఫలితాలు 2023 ఆగస్టు 6న వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని ఎంపిక చేసినట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది.
- విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికత, వయసు, శారీరక దారుఢ్యం, రాత పరీక్షల ఫలితాల ఆధారంగా ఎంపిక చేసినట్లు వివరించింది.
- వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్లో ప్రత్యేక లాగిన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అన్ని కేటగిరీల్లో ఎంపిక చేసిన పోస్టులకు సంబంధించి కటాఫ్ మార్కులు వెల్లడిస్తామని పేర్కొంది. అభ్యర్థుల నేపథ్యం, ప్రవర్తన, వైద్య పరీక్షలు, పెండిరగ్ కేసుల పరిశీలన ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది.
అభ్యర్థులూ.. ఇలా చేయండి..
- టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్లోని లాగిన్‌లో అందుబాటులో ఉంచిన స్వీయ ధ్రువీకరణ పత్రం (అటెస్టేషన్ ఫామ్)ను ఆగస్టు 9 నుంచి 11 లోపు పూరించాలని ఎంపికైన అభ్యర్థులకు సూచించింది. ఈ స్వీయ ధ్రువపత్రాలు నింపాక మూడు ప్రతులు ప్రింట్ తీసుకుని ఒక్కో నకలుకు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అతికించాలని, వీటిని గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైనా దాన్ని వదులుకుంటామని ముందస్తుగా అంగీకార పత్రం, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన పత్రాలు ఈ నెల 14న జోన్ల వారీగా డీఐజీ కార్యాలయాల్లో సమర్పించాలని వివరించింది. తుది రాత పరీక్ష రాసినా ఎంపిక కాలేకపోయిన అభ్యర్థులు తాము రాసిన పరీక్ష ఫలితాల విషయంలో సందేహాలుంటే స్పష్టత కోసం ఆగస్టు 9 వరకు వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనికి ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు, ఇతరులు రూ.3 వేలు చెల్లించాలని పేర్కొంది. వీటిపై వీలైనంత త్వరగా బోర్డు ఆన్‌లైన్ ద్వారా సమాధానం ఇస్తుందని వివరించింది.
No comments:
Post a Comment