- మయన్మార్‌లో ఎమర్జెన్సీని సైనిక ప్రభుత్వం పొడిగించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- రాజధాని నేపిడాలో 2023 జులై 31న సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీవీ ఛానల్ వెల్లడిరచింది.
- పేరుకే ఎన్‌డీఎస్‌సీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా అధికారమంతా సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఆదేశాల మేరకే ఎమర్జెన్సీని పొడిగించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధం కాకపోవడంతోపాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందనే సైన్యం ఇలా ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఆగస్టు 1 నుంచి 6 నెలలపాలు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది.
Wednesday, August 2, 2023
మయన్మార్‌లో ఎమర్జెన్సీ పొడిగింపు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment