Saturday, August 12, 2023

Women Protection : పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద అప్పిలేట్‌ అథారిటీ


  • పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద అప్పీళ్ల పరిష్కారం కోసం అప్పిలేట్‌ అథారిటీని ప్రభుత్వం నియమించింది. 
  • పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఏర్పాటైన 8 కోర్టులు, ట్రైబ్యునళ్ల అప్పీళ్ల పరిష్కారం కోసం అప్పిలేట్‌ అథారిటీగా వ్యవహరించనున్నాయి. 
  • ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిణి ఉత్తర్వులు జారీచేశారు. 
  • పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద ఆయా ప్రాంతాల అప్పీళ్లను కోర్టులు, ట్రైబ్యునళ్లు పరిశీలిస్తాయి. 
  • అప్పిలేట్‌ అథారిటీగా హైదరాబాద్‌ కార్మిక కోర్టులు 1, 2, 3, అదనపు పారిశ్రామిక ట్రైబ్యునల్‌- లేబర్‌ కోర్టు, పారిశ్రామిక ట్రైబ్యునల్‌- 1, 2, గోదావరిఖని, వరంగల్‌లోని పారిశ్రామిక ట్రైబ్యునల్‌ కోర్టులు ఉంటాయి.

No comments:

Post a Comment