- మయన్మార్ ప్రజా నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ (78) జైలుశిక్షను సైనిక ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. బుద్ధుడు తొలి ధర్మోపదేశం-ధర్మచక్ర పరివర్తన సూత్రాన్ని ప్రవచించిన పర్వదినమైన ఆగస్టు 1న క్షమాభిక్ష పొందిన 7,749 మంది ఖైదీల్లో ఆమె ఒకరు.
- సూకీకి 19 కేసుల్లో విధించిన 33 ఏళ్ల జైలు శిక్షలో ఆరేళ్లు మాత్రమే తగ్గించినందున ఆమె ఇంకా 27 ఏళ్లపాటు జైల్లో మగ్గక తప్పదు.
- మాజీ అధ్యక్షుడు విన్ మైయింట్‌కు విధించిన 12 ఏళ్ల జైలు శిక్షలో నాలుగేళ్లు తగ్గించారు. మరోవైపు మయన్మార్‌లో అత్యవసర పరిస్థితిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నామని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయదలిచామని సైనిక ప్రభుత్వం తెలిపింది.
- 2021 ఫిబ్రవరి 1న.. ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం సూకీని అదే రోజు అరెస్టు చేసింది.
Wednesday, August 2, 2023
మయన్మార్ లో ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని సైనిక ప్రభుత్వం ఎప్పుడు చేజిక్కించుకుంది?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment