- పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్‌ఖాన్‌ను తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలుస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు 2023 ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
- అంతేగాక, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
- మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌లోని తన నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తోషాఖానా కేసు..
- 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్‌ఖాన్ పదవీచ్యుతుడయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది.
- ఇమ్రాన్ తన హయాంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి.
- కానీ, ఇందులో రూ.38 లక్షల రొలెక్స్ గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్ గడియారానికి రూ.2,94,000 మాత్రమే చెల్లించారు.
- ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇంటికి చేర్చుకొన్న ఇమ్రాన్.. రూ.8 లక్షల కానుకలను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
- ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకొన్నారని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
No comments:
Post a Comment