నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల కిందట నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక తాజాగా వెలుగు చూసింది. 1945 ఆగస్టు 18న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో పేర్కొన్నారు. నేతాజీ మరణ కారణాల్ని ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్‌సైట్ Bosefiles.info ఈ వివరాల్ని బయటపెట్టింది. 1956లో ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి సమర్పించినట్లు వెల్లడైంది. తైవాన్‌లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ తైపీ ఆస్పత్రిలో అదేరోజు సాయంత్రం మరణించారని వెల్లడించింది. విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమ వైపు రెక్కలోని పెటల్ విరగడంతో ఇంజిన్ ఆగిపోయింది. దాంతో విమానం అదుపుతప్పి కింద ఉన్న కంకర రాళ్లపై పడింది. క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. మంటలు అంటుకోవడంతో బోస్ కిందకు దూకేశారు. కల్నల్ రెహమాన్, ఇతర ప్రయాణికులు నేతాజీ బట్టలుతీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాన్‌మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ ఆర్మీ ఆసుపత్రిలో చేర్చగా రాత్రి 7 గంటల సమయంలో మరణించారు. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు’ అని విచారణ నివేదికలో పేర్కొన్నారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Monday, September 12, 2016
సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల కిందట నాటి జపాన్ నివేదిక

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment