Sunday, September 11, 2016

జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక



2015లో దేశంలో నమోదైన నేర గణాంకాలకు సంబంధించిన నివేదికను జాతీయ నేర గణాంక సంస్థ(NCRB) విడుదల చేసింది.
సైబర్‌ నేరాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014తో పోలిస్తే 2015లో ఈ తరహా నేరాలు 90.1 శాతం మేర పెరిగాయి. అదే తెలంగాణలో స్వల్పంగా  తగ్గుముఖం పట్టినప్పటికీ నమోదైన నేరాల సంఖ్య మాత్రం దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అధికంగానే ఉంది.
సూటిపోటు మాటతో (స్టాకింగ్‌) మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే నేరాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ, ఏపీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది అన్ని రకాల నేరాలు కలిపి 29,49,400 నమోదుకాగా వాటిలో ఏపీలో 3.8 శాతం, తెలంగాణలో 3.6 శాతం నేరాలు నమోదయ్యాయి. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

మానవ అక్రమ రవాణా నేరాలు
1. అసోం
2. పశ్చిమ్‌ బంగ
3. తమిళనాడు
4. తెలంగాణ

ఎస్సీ, ఎస్టీపై జరుగుతున్న నేరాలు
1. ఉత్తరప్రదేశ్‌
2. రాజస్థాన్‌
3. బిహార్‌
4. ఆంధ్రప్రదేశ్‌

సైబర్‌ నేరాలు
1. ఉత్తరప్రదేశ్‌
2. మహారాష్ట్ర
3. కర్ణాటక,
4. రాజస్థాన్‌

రైళ్లలో జరిగే దొంగతనాలు
1. మహారాష్ట్ర
2. ఉత్తరప్రదేశ్‌
3. మధ్యప్రదేశ్‌
4. ఆంధ్రప్రదేశ్‌


NCRB-National Crime Records Bureau

No comments:

Post a Comment