కృషా పుష్కరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముగిశాయి. విజయవాడ సమీపాన ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమ క్షేత్రంలో ఏపీ ప్రభుత్వం పుష్కరాలకు ముగింపు పలికింది.
మహబూబ్‌నగర్‌లోని గొందిమళ్ల, బీచుపల్లిలో నిర్వహించిన పుష్కరల ముగింపు ఉత్సవంలో తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా వాడపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణమ్మకు తెప్పోత్సవం నిర్వహించి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,91,53,792 మంది పుష్కర స్నానమాచరించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో దాదాపు 2.5 కోట్ల మంది పుష్కర స్నానమాచరించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
No comments:
Post a Comment