Sunday, September 11, 2016

తల మార్పిడి శస్త్ర చికిత్సకు సిద్ధమన్న వాలెరీ స్పిరిడోనోవ్‌


అత్యంత క్లిష్టమైన మానవ తల మార్పిడి శస్త్ర చికిత్సను సుసాధ్యం చేస్తానని ఇటలీ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సెర్గియో క్యానవెరో గతంలో ప్రకటించిన నేపథ్యంలో.. దీన్ని చేయించుకోవడానికి రష్యా యువకుడు వాలెరీ స్పిరిడోనోవ్‌ తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థను నడిపించే స్పిరిడోనోవ్‌ కండరాలను క్షీణింపచేసే వెర్డ్‌నింగ్‌-హాప్‌ మ్యాన్‌ జబ్బుతో బాధపడుతున్నాడు. దీంతో అతడి శరీరం కింద భాగం చాలావరకు చచ్చుబడింది. ప్రస్తుతం పూర్తిగా చక్రాల కుర్చీకు పరిమితమయ్యాడు. ఈ జబ్బు బారినపడిన వారిలో చాలామంది మృత్యువాత పడుతుంటారు. అందువల్ల  తాను జీవించి ఉండటానికి తల మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పిరిడోనోవ్‌ భావిస్తున్నాడు. అందుకే ప్రమాదకరమైన శస్త్రచికిత్స అయినా స్వచ్ఛందంగా చేయించుకోవడానికి మందుకొచ్చాడు.






No comments:

Post a Comment